Advertisement

Walk-in Drive for Trainee Test Engineers : హైదరాబాద్‌లో గేమింగ్ జాబ్ ఛాన్స్… Trainee Test Engineer వాక్‌ఇన్!

ప్రముఖ MNC కంపెనీ అయిన Side కంపెనీకి సంబంధించి హైదరాబాద్‌లో Trainee Test Engineer పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నుంచి 24 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 0 నుంచి 1 సంవత్సరం అనుభవం ఉన్నవారికి ఇది మంచి అవకాశం.

ఈ ఉద్యోగం Quality Assurance కేటగిరీకి చెందింది. ఎంపికైన అభ్యర్థులు గేమ్స్‌లో బగ్స్‌ను గుర్తించడం, టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేయడం, గేమ్ ఫీచర్స్‌ ను చెక్ చేయడం వంటి పనులు చేయాలి. బగ్ రిపోర్టింగ్, టెస్టింగ్ డాక్యుమెంటేషన్ కూడా బాధ్యతల్లో భాగం.

Advertisement

ఈ జాబ్ కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉంటుంది (1–2 నెలలు, పనితీరుపై ఆధారపడి ఎక్స్‌టెండ్ అవుతుంది). వర్క్ ఫ్రం ఆఫీస్ (Hi-Tech City, Hyderabad)లో పనిచేయాలి. రోటేషనల్ లేదా నైట్ షిఫ్ట్స్‌ లో పని చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి సుమారు ₹1.9 లక్షల జీతం అందుతుంది.

గేమింగ్‌ పై ఆసక్తి ఉన్నవారికి ఇది బెస్ట్ ఛాన్స్. మొబైల్, PC, కన్సోల్ గేమ్స్‌పై అవగాహన ఉండాలి. RPG, FPS, స్ట్రాటజీ వంటి గేమ్ జానర్స్‌ పై బేసిక్ నాలెడ్జ్ ఉండటం ప్లస్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్‌తో పని చేసే సామర్థ్యం అవసరం. గరిష్టంగా 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు.

గేమింగ్ ఫీల్డ్‌ లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి

Advertisement