Advertisement

సిద్ధిపేట: నేడు BRS నేతలతో KCR మీటింగ్

హైదరాబాద్: గురువారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు కీలక భేటీ జరగనుంది. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP) సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ విధిగా హాజరుకావాలని అధిష్టానం సూచించింది. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై గళమెత్తే తీరుపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైతాంగ సమస్యలు, హామీల అమలు, సంక్షేమ పథకాల వ్యూహాలపై పార్టీ ప్రజాప్రతినిధులకు ఆయన స్పష్టమైన కార్యాచరణను అందించనున్నారు.

Advertisement

Advertisement