Advertisement

బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత

TG: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి తమ అమ్మపై పగ పెంచుకున్నారని ఆరోపించారు. తాను కేవలం వ్యక్తిగత అంశంపైనే మాట్లాడానని, పార్టీ గురించి కాదని స్పష్టం చేశారు. ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన సురేఖను బలి చేయడం సరికాదన్నారు.

“మా అమ్మ ఏం తప్పు చేసింది? ఆమె శాఖలో ఎటువంటి తప్పూ జరగలేదు. కేవలం నేను మాట్లాడిన మాటలను ఆసరాగా చేసుకుని మా అమ్మను పదవి నుంచి తొలగించారు. ఈ పరిణామంతో మేము తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. తిండి, నిద్రలేకుండా రోధిస్తున్నాం” అంటూ సుస్మిత బోరున విలపించారు.

Advertisement
Advertisement