Advertisement

ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 6.79 లక్షల క్యూసెక్కులు

గోదావరిఖని, మన పత్రిక : తాజా సమాచారం ప్రకారం, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతోంది. ఈ రోజు సాయంత్రం 6 లక్షల 79 వేల 709 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది.

అర్ధరాత్రి వరకు ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగా, ప్రాజెక్టు మొత్తం 64 గేట్లలో 43 గేట్లను ఎత్తి 6,84,720 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు.

Advertisement

పార్వతీ బ్యారేజ్ విషయంలో కూడా ఇన్‌ఫ్లో 6,01,825 క్యూసెక్కులుగా ఉంది. ఇది అవుట్ ఫ్లోతో సమానంగా ఉండటం వల్ల నీటి మట్టం స్థిరంగా ఉంది. బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం 130 మీటర్లు, ప్రస్తుతం 123.90 మీటర్లు ఉంది.

ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు, ప్రస్తుతం 146.21 మీటర్లు ఉంది. నీటి నిల్వలు పూర్తి స్థాయిలో 20.175 టీఎంసీలు, ప్రస్తుతం 15.4031 టీఎంసీలు ఉన్నాయి.

నీటి విడుదలలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకు 303 క్యూసెక్కులు, రామగుండం ఎన్టిపిసి ప్రాజెక్టుకు 121 క్యూసెక్కులు నీరు అందిస్తున్నారు.

Advertisement