మన పత్రిక, నల్గొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేక్యతండా గ్రామపంచాయతీ వస్త్రం తండా వద్ద ఇటుకల లోడుతో వెళ్తున్న ఓ లారీ, ప్యాసింజర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వారిని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.
Advertisement
ఈ ప్రమాదానికి సంబంధించి మృతుల వివరాలు తదితర పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
