మన పత్రిక, వెబ్‌డెస్క్: భారీ ఇన్‌ఫ్లో కారణంగా అధికారులు ప్రాజెక్టుకు చెందిన మొత్తం 62 గేట్లలో 13 గేట్లను ఎత్తి, 1,05,157 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 147 మీటర్లు (పూర్తి స్థాయి మట్టం 148 మీటర్లు)గా ఉంది.
ఈ ప్రాజెక్టుకు శ్రీరామ్ సాగర్ (ఎస్సారెస్పీ) నుంచి 50,000 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 4,744 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సుందిళ్ల పార్వతి బ్యారేజ్‌కు 12,151 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, మొత్తం 74 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 119.59 మీటర్లుగా (పూర్తిస్థాయి మట్టం 130 మీటర్లు) నమోదైంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

