Advertisement

HYD: 29, 30వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడా పోటీలు

మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. నిరంతరం ప్రజా సమస్యలు, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి రాష్ట్రం నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రస్తుత శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.29, 30 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పోటీలు

గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, టెన్నిస్‌తో పాటు అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు ఉండనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ ఈ క్రీడల్లో పాలుపంచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే వేగవంతం చేశారు. క్రీడాకారులకు అవసరమైన కిట్లు, ట్రాక్ సూట్లు, వైద్య సదుపాయాలను సిద్ధం చేశారు. రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా మైదానంలో పోటీ పడనుండటం విశేషం.

Advertisement
Advertisement