Advertisement

ప్రియుడి మోజులో భర్తను కడతేర్చిన భార్య

మన పత్రిక, వెబ్​డెస్క్ : భర్తలపై భార్యల దాడులు జరుగుతూనే ఉన్నాయి. వయసును కూడా మర్చిపోయి క్షణికావేశంలో కట్టుకున్నవాడిని కడతేరుస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని వెల్మల్ గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 33 ఏళ్ల నాగలక్ష్మి అనే మహిళ, పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత తన ప్రియుడు మహేశ్‌తో కలిసి తన భర్త హరిచరణ్‌ను దారుణంగా హత్య చేసింది. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

హత్య ప్రణాళికలో భాగంగా.. నాగలక్ష్మి, మహేశ్ కలిసి హరిచరణ్ గొంతుకు టవల్ బిగించి చంపేశారు. అనంతరం ఇది బాత్రూమ్‌లో మూర్ఛతో సంభవించిన మరణమని నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే, మృతుడి కొడుకుకు తన తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు త్వరితగతిన స్పందించి నాగలక్ష్మి, ఆమె ప్రియుడు మహేశ్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement