మన పత్రిక, వెబ్‌డెస్క్: “నా దేశం అంటే నాకు ప్రాణం.. కానీ ఇక్కడి వ్యవస్థను భరించలేకపోతున్నా..” అంటూ బెంగళూరుకు చెందిన టెకీ కమ్ వ్యాపారి రోహిత్ ప్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేవలం 18 నెలల్లో రూ.4 కోట్లు పన్ను నిజాయితీగా కట్టినా, అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదని, అందుకే ఇండియా వదిలేసి వెళ్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఒక్క రోహిత్ ఆవేదన మాత్రమే కాదు.. గత 14 ఏళ్లలో దాదాపు 20 లక్షల మంది భారతీయులు దేశం విడిచి 135 దేశాలకు వలస వెళ్లారు. దీనికి ప్రధాన కారణం లోపభూయిష్టమైన పన్నుల విధానం, బ్యూరోక్రసీ వేధింపులేనని విశ్లేషకులు అంటున్నారు. నిజాయితీగా పన్నులు కట్టే 5 శాతం మందిని కూడా నిత్యం అనుమానంగా చూడటం, నోటీసులతో వేధించడం వల్లే సంపన్నులు, మేధావులు విదేశాల బాట పడుతున్నారు.
మరోవైపు, లక్షల్లో పన్నులు కడుతున్నా.. దానికి తగ్గ నాణ్యమైన జీవన ప్రమాణాలు (రోడ్లు, వైద్యం, విద్య) దక్కడం లేదన్నది సగటు పౌరుడి ఆవేదన. పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నా, కనీస సౌకర్యాలు కరువయ్యాయన్న అసహనం యువతలో పెరిగిపోతోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
