Xiaomi 17 Series : షియోమీ ఫోన్లకు భారత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షియోమీ సిరీస్ అంటే అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ఫోన్ల కోసం స్మార్ట్ ఫోన్ అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. షియోమీ నుంచి సరికొత్త సిరీస్ అయిన 17 ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది కానీ.. భారత్ లో మాత్రం రిలీజ్ కాలేదు.
17 సిరీస్ లో భాగంగా 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఈ మూడు మోడల్స్ చైనాలో విడుదలయ్యాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 చిప్ సెట్, 6.9 ఇంచ్ 2కే ఓఎల్ఈడీ డిస్ ప్లే, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 50 ఎంపీ మెయిన్ సెన్సార్, ఆండ్రాయిడ్ 16 లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే.. భారత్ లో ఈ సిరీస్ మార్చి 2026 లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అప్పుడే ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
