Advertisement

వరంగల్ మామునూరు విమానాశ్రయ పనులకు త్వరలో టెండర్లు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

మన పత్రిక: వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎదురుచూపులు త్వరలోనే ముగియనున్నాయి. ఈ విమానాశ్రయ పనులకు సంబంధించి నాలుగు వారాల్లోగా టెండర్లను ఆహ్వానిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

2028 నాటికి పూర్తి

మామునూరు విమానాశ్రయ పనులను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూమిని కేటాయించడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కేంద్రం అందిస్తున్న సహకారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

ఆదిలాబాద్‌లో భూసేకరణ

ఈ సమావేశంలో ఇతర ప్రాంతీయ విమానయాన అభివృద్ధిపై కూడా చర్చ జరిగింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటు కోసం 1,500 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు సమాచారం.

Advertisement