మన పత్రిక, మహేశ్వర్: గత ఏడాది కుంభమేళా ఫోటోలతో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన భాగ్యశ్రీ అలియాస్ మోనాలిసా ప్రేమపెళ్లి వ్యవహారంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. కేరళకు చెందిన ఫర్హాన్ ఖాన్‌ను ఆమె ఇటీవల వివాహం చేసుకోగా, కుటుంబ సభ్యులు లవ్ జిహాద్ ఆరోపణలతో జాతీయ ఎస్టీ (NCST) కమిషన్‌ను ఆశ్రయించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా అధికారులు వయస్సు నిర్ధారణ విచారణ చేపట్టగా, పెళ్లి నాటికి మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్ల రెండు నెలలు మాత్రమేనని అధికారికంగా తేలింది. మైనర్‌ను వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం కావడంతో, మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫర్హాన్ ఖాన్‌పై పోలీసులు వెంటనే పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయంతో, సినిమా అవకాశాల ఆకర్షణలో పడి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
