Advertisement

హాలీవుడ్ ఆఫర్లపై రాజమౌళి కీలక వ్యాఖ్యలు

ప్రసిద్ధ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి హాలీవుడ్ చిత్రాల ప్రతిపాదనలపై స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా విజయం సాధించిన తర్వాత తనకు హాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ విషయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘వారణాసి’ చిత్రంపైనే పూర్తి దృష్టి పెట్టానని రాజమౌళి తెలిపారు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లు చేయడం తన విధానం కాదని, అందువల్లే హాలీవుడ్ ఆఫర్లను వెంటనే అంగీకరించలేదని చెప్పారు. వారణాసి సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ల గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్న వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ కార్తికేయ, కె ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుందని, మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని రాజమౌళి పేర్కొన్నారు.

Advertisement