మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇటలీ వెళ్లిన ఈ జంట, సోమవారం (జనవరి 5) తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వెళ్లేటప్పుడు వేర్వేరుగా వెళ్లినప్పటికీ, తిరుగు ప్రయాణంలో మాత్రం ఇద్దరూ కలిసే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం వీరి ఎయిర్పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎయిర్‌పోర్టులో సందడి మీడియా కంటపడకుండా ఉండేందుకు ఇద్దరూ మాస్కులు ధరించి, లో-ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. రష్మిక గ్రే ట్రౌజర్స్, వైట్ టీషర్ట్, బ్లాక్ కోట్తో కనిపించగా.. విజయ్ బ్లాక్ ప్యాంట్స్, లెదర్ జాకెట్, బ్లూ క్యాప్‌తో స్టైలిష్‌గా మెరిశాడు. ఫోటోగ్రాఫర్లకు పోజులివ్వకుండానే సెక్యూరిటీ నడుమ వేగంగా కారులో వెళ్లిపోయారు. వీరిని చూసిన నెటిజన్లు “పర్ఫెక్ట్ కపుల్”, “లవ్ బర్డ్స్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఇటలీలో వీరు షేర్ చేసిన ఫోటోల బ్యాక్గ్రౌండ్స్ ఒకేలా ఉండటం, విజయ్ ఫోటోలో ఓ అమ్మాయి (రష్మిక అని ఫ్యాన్స్ భావన) కనిపించడం చర్చనీయాంశమైంది.
పెళ్లి ముహూర్తం ఫిక్స్? మరోవైపు వీరి పెళ్లి వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గతేడాది అక్టోబర్ 3న (దసరా మరుసటి రోజు) వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్నట్లు టాక్. అంతేకాకుండా, 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
