Advertisement
Satish shah died

Satish Shah: ప్రముఖ నటుడు సతీష్ షా కన్నుమూత.. ‘మైన్ హూన్ నా’ ఫేమ్!

మన పత్రిక, వెబ్​డెస్క్: ‘సరాభాయి వర్సెస్ సరాభాయి’, ‘మైన్ హూన్ నా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు సతీష్ షా (74) శనివారం కన్నుమూశారు. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న ఆయన, హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Advertisement

ఈ విషయాన్ని సిన్టా (CINTAA) అధికార ప్రతినిధి అశోక్ పండిట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు. “మన ప్రియమైన స్నేహితుడు, గొప్ప నటుడు సతీష్ షా కొన్ని గంటల క్రితం కిడ్నీ వైఫల్యంతో మరణించారు. ఇది సినీ పరిశ్రమకు తీరని లోటు” అని ఆయన విచారం వ్యక్తం చేశారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement