మన పత్రిక, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల (Venu Udugula) ‘రజాకార్’ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చూపించడానికి తీసింది కాదని, అది పూర్తిగా భారతీయ జనతా పార్టీ (BJP) రాజకీయ ఎజెండాలో భాగమని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
చరిత్రను మానవీయ కోణంలో చెప్పాలి కానీ, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ నెగటివ్‌గా చూపించడం సరికాదన్నారు. రజాకార్లలో కేవలం ముస్లింలే కాకుండా ఇతరులు కూడా ఉన్నారని, సాయుధ పోరాటం గురించి తెలిసిన చరిత్రకారులను గానీ, సాక్షులను గానీ సంప్రదించకుండానే ఈ సినిమాను తెరకెక్కించారని విమర్శించారు.
Advertisement
కాగా, బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన విషయం తెలిసిందే. ‘విరాటపర్వం’ దర్శకుడి వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
