WhatsApp
Advertisement

Veldanda: నూతన సీఐగా రఘువీర్ రెడ్డి.. బాధ్యతల స్వీకరణ

మన పత్రిక వెబ్​డెస్క్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రఘువీర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తించిన విష్ణువర్ధన్ రెడ్డికి మల్టీ జోన్ 2 ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఆయన బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లాలో పనిచేసి బదిలీపై వచ్చిన రఘువీర్ రెడ్డి నూతన సీఐగా చార్జ్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నూతన సీఐ రఘువీర్ రెడ్డిని, అలాగే బదిలీపై వెళ్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని సర్కిల్ పరిధిలోని ఎస్సైలు కురుమూర్తి, మహేష్ గౌడ్, వీరబాబు శాలువాలతో సత్కరించి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ వెల్దండ సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement