Advertisement

వనవీర ట్రైలర్ విడుదల.. మైథలాజికల్ డ్రామాతో అవినాష్ ఎంట్రీ, విలన్‌గా

మన పత్రిక, వెబ్​డెస్క్: అవినాష్ తిరువీధుల కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘వనవీర’. మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, నందు ప్రతినాయకుడి పాత్రలో వైవిధ్యంగా కనిపించనున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు హర్ష, బాబీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement