మన పత్రిక, వెబ్డెస్క్ : అనూహ్యంగా వచ్చిన వరదను తట్టుకొని నిలబడిన పోచారం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం 70 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నప్పటికీ, 1,82,000 క్యూసెక్కుల భారీ వరదను కూడా డ్యామ్ బలంగా తట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇది తమ శాఖకు భారీ ఉపశమనం కలిగించిందని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ రామకృష్ణారావు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. పాలనా యంత్రాంగం సకాలంలో తీసుకున్న చర్యల వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని తెలిపారు. ప్రాజెక్టుకు వరద ఇన్-ఫ్లో తగ్గడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలియజేశారు. వరద నీటిలో చిక్కుకున్న రూప్ సింగ్ తండా, వాడి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన ఆహారం, మంచినీరు అందించాలని ఆదేశించారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

