మన పత్రిక, వెబ్‌డెస్క్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై యూఎస్ అధికారులు కొరడా ఝులిపించారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టార్లో నిర్వహించిన తనిఖీల్లో 30 మంది భారతీయులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ (US Border Patrol) అధికారులు అరెస్ట్ చేశారు. వీరందరూ అక్రమంగా దేశంలో ఉంటూనే, కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులు (CDL) పొంది భారీ సెమీ ట్రక్కులను నడుపుతున్నట్లు గుర్తించారు.
ఆపరేషన్ వివరాలు:
Advertisement
- తనిఖీలు: నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య ఇంటర్ స్టేట్ హైవేలు, చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను పట్టుకోగా, అందులో అత్యధికులు (30 మంది) భారతీయులే కావడం గమనార్హం. మిగిలిన వారు చైనా, రష్యా, మెక్సికో తదితర దేశాలకు చెందినవారు.
- లైసెన్సులు: వీరికి కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల నుంచి కమర్షియల్ లైసెన్సులు జారీ అయినట్లు అధికారులు గుర్తించారు.
- ఆపరేషన్ హైవే సెంటినెల్: మరోవైపు డిసెంబర్ 10, 11 తేదీల్లో ‘ఆపరేషన్ హైవే సెంటినెల్’ పేరుతో ట్రక్కింగ్ కంపెనీలే లక్ష్యంగా భారీ దాడులు నిర్వహించారు. ఇందులో మరో 45 మంది అక్రమ వలసదారులు పట్టుబడ్డారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
