Advertisement

Urea Dubbaka | టోకెన్ల పంపిణీలో ఏఈఓపై రైతుల ఆగ్రహం

మన పత్రిక, వెబ్​డెస్క్ : దుబ్బాకలో ( DUBBAKA ) యూరియా టోకెన్ల పంపిణీ విషయంలో ఏఈఓ సంతోష్పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పిఎసిఎస్ కార్యాలయానికి యూరియా ( UREA ) రాగానే రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వినాయక చవితి పండుగ ఉన్నా, వర్షం కురుస్తున్నా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు గొడుగులు పట్టుకొని నిలబడ్డారు.

కానీ ఏఈఓ సంతోష్ తనకు నచ్చిన వారికి మాత్రమే అదనపు టోకెన్లు ఇచ్చాడు. ముందస్తుగా 40 నుండి 50 బ్యాగులకు సంబంధించిన టోకెన్లు తన అనుచరులకు అందించాడు. దీంతో ఉదయం నుంచి వర్షంలో నిలబడిన చాలామంది రైతులకు యూరియా లభించలేదు. ఈ అన్యాయమైన పంపిణీ పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పండుగ, వర్షం అనే లెక్కలు చూడకుండా క్యూలో నిలబడినా ప్రయోజనం లేకపోవడం రైతులను నిరాశకు గురిచేసింది.

Advertisement
Advertisement