Advertisement
upi scam alert

UPI ఫ్రాడ్ నుంచి కాపాడుకోండి – ఈ 3 తప్పులు ఎప్పుడూ చేయకండి

UPI Fraud: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని తీసుకొచ్చింది. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు క్షణాల్లో డబ్బు బదిలీ చేయడం సాధ్యమవుతోంది. కానీ, ఈ సౌలభ్యం ఫ్రాడ్‌స్టర్లకు కూడా అవకాశాలు కల్పిస్తోంది. చిన్న జాగ్రత్తలు లేకుండా ఉంటే, మీ డబ్బు అంతా దొంగల చేతిలో పడే అవకాశం ఉంది.

Advertisement

అనుమానాస్పద లింక్‌లు, QR కోడ్‌లు ఎప్పుడూ క్లిక్ చేయకండి
ఏదైనా అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన లింక్‌లు లేదా QR కోడ్‌లు క్లిక్ చేయడం మీ ఖాతాల భద్రతకు పెద్ద ముప్పు. ఫ్రాడ్‌స్టర్లు క్యాష్‌బ్యాక్, బహుమతులు లేదా రివార్డ్స్ అనే మాయలతో మిమ్మల్ని ఆకర్షిస్తారు. ఒక్కసారి క్లిక్ చేసినంత మాత్రాన మీ వ్యక్తిగత డేటా, UPI వివరాలు వారి చేతిలో పడతాయి. ఇది భారీ ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది.

Advertisement

“మీకు డబ్బు పంపుతున్నాము” అనే మోసం
చాలా సార్లు ఫ్రాడ్‌స్టర్లు “మీకు డబ్బు పంపుతున్నాము” అని పెద్ద మొత్తంలో పేమెంట్ రిక్వెస్ట్ పంపుతారు. దీన్ని చూసి మీరు గ్రీడ్ లో ఉండి, UPI PIN ఎంటర్ చేస్తే, మీ ఖాతాలో ఉన్న డబ్బు వారి ఖాతాలోకి వెళ్లిపోతుంది. గుర్తుంచుకోండి: డబ్బు అందుకోవడానికి UPI PIN ఎంటర్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు.

UPI PIN, OTP ఎవరితోనైనా షేర్ చేయకండి
మీ UPI PIN, OTP, కార్డ్ వివరాలు ఎవరితోనైనా షేర్ చేయకండి. బ్యాంకులు, RBI లేదా ఏ నమ్మకమైన సంస్థ కూడా మీకు ఫోన్ చేసి ఇలాంటి వివరాలు అడగరు. ఎవరైనా మీకు ఫోన్ చేసి ఇలాంటి డేటా అడిగితే, అది ఫ్రాడ్ అని తెలుసుకోండి.

Advertisement

UPI సౌలభ్యాన్ని ఆస్వాదించండి, కానీ జాగ్రత్తలు తీసుకోండి. మీ డబ్బు మీ చేతిలో ఉండాలంటే, ఇలాంటి తప్పులు ఎప్పుడూ చేయకండి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement