ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు ఉల్ట్రావయిలెట్ ( Ultraviolette x47 crossover ) నుంచి బిగ్ గుడ్ న్యూస్! కంపెనీ X47 క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్‌ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ధర రూ.2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు). కానీ, మొదటి 1,000 కస్టమర్లకు రూ.2.49 లక్షలకే స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. X47 క్రాస్ఓవర్ అడ్వెంచర్ టూరింగ్ మరియు స్ట్రీట్ నేకెడ్ బైక్‌ల మధ్య క్రాస్ఓవర్ డిజైన్‌తో వస్తోంది. ఇది F77 ప్లాట్ఫారమ్‌పై ఆధారపడినప్పటికీ, ప్రత్యేక చాసిస్, సబ్-ఫ్రేమ్ ఉపయోగించారు. బీక్-స్టైల్ ఫెండర్, స్కల్ప్టెడ్ ట్యాంక్, రేక్డ్ టైల్ సెక్షన్ దీనికి ప్రత్యేకత.
ఈ బైక్ మూడు రంగుల్లో లభిస్తుంది: లేజర్ రెడ్, ఏర్స్ట్రైక్ వైట్, షాడో బ్లాక్. ప్రత్యేక ఎడిషన్ ‘డెజర్ట్ వింగ్’ వేరియంట్‌లో రియర్ లగ్జరీ ర్యాక్, సాడిల్ స్టేల్స్, సాఫ్ట్/హార్డ్ ప్యానియర్స్ స్టాండర్డ్‌గా ఉంటాయి. ఇందులో హైలైట్ ఫీచర్ UV హైపర్సెన్స్ రాడార్ టెక్నాలజీ. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్ అసిస్ట్, ఓవర్టేక్ అలర్ట్, రియర్ కాలిషన్ వార్నింగ్ వంటి ఫీచర్లు అందిస్తుంది. రెండు ఇంటిగ్రేటెడ్ కెమెరాలు డాష్-కెమెరాలుగా పనిచేస్తాయి.ఐచ్ఛికంగా డ్యూయల్ డిస్ప్లే సెటప్ కూడా ఉంటుంది. ఇందులో ముందు మరియు వెనుక కెమెరా ఫీడ్‌లను రియల్-టైమ్‌లో చూడొచ్చు. కలర్ TFT డిస్ప్లే, మూడు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్, తొమ్మిది స్థాయిల బ్రేక్ రీజనరేషన్ కూడా ఉన్నాయి.స్విచ్ చేయగల డ్యూయల్-ఛానల్ ABS కూడా ఈ బైక్‌లో ఉంది. ఎలక్ట్రిక్ మోటార్ 40bhp పవర్, 100Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 0-60kmph వేగాన్ని 2.7 సెకన్లలో, 0-100kmph ని 8.1 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్ఠ వేగం 145kmph.
రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు: 7.1kWh మరియు 10.3kWh. ఒక్కసారి ఛార్జిపై IDC రేంజ్ వరుసగా 211km మరియు 323km. ఇంటిగ్రేటెడ్ ఛార్జర్ కూడా బైక్‌తో పాటు వస్తుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు అక్టోబర్ 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది భారతీయ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో పెద్ద మార్పు తీసుకురానుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

