మన పత్రిక వెబ్‌డెస్క్, న్యూఢిల్లీ: uk07 rider accident news – ప్రముఖ మోటో వ్లాగర్ (UK07 Rider), బిగ్‌బాస్-17 మాజీ కంటెస్టెంట్ అనురాగ్ దోవల్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. శనివారం ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై టొయోటా ఫార్చ్యూనర్ కారులో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఉద్దేశపూర్వకంగా డివైడర్‌ను ఢీకొట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తీవ్ర గాయాలపాలైన అనురాగ్‌ను మీరట్‌లోని సుభార్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు:
- కులాంతర వివాహమే కారణమా? గత ఏడాది మే నెలలో తన ప్రియురాలు రితికాను అనురాగ్ కులాంతర వివాహం చేసుకున్నాడు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పాటు, తనను ఇంటి నుంచి గెంటేశారని రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన “ది లాస్ట్ మెసేజ్” వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
- భార్య దూరం: కుటుంబ సభ్యుల వేధింపులు, టార్చర్ తట్టుకోలేక తన భార్య రితికా కూడా తనను వదిలేసి వెళ్లిపోయిందని, తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లానని అనురాగ్ పేర్కొన్నాడు.
- లైవ్‌లో కంటతడి: యాక్సిడెంట్ చేయడానికి ముందు కారులో 150 కి.మీ వేగంతో వెళ్తూ.. దాదాపు 82 వేల మంది చూస్తున్న ఇన్‌స్టా లైవ్‌లో కన్నీరుమున్నీరయ్యాడు. “మరుజన్మలోనైనా నాకు ప్రేమను పంచు మమ్మీ. నాకు ప్రేమ, ధైర్యం చాలా అవసరం.. కానీ ఎవరూ లేరు. ఇదే నా ఫైనల్ డ్రైవ్” అంటూ డివైడర్‌ను ఢీకొట్టాడు.
ఒకప్పుడు లగ్జరీ కార్లు, బైక్‌లతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, బిగ్‌బాస్ స్థాయికి ఎదిగిన అనురాగ్.. ఇలా కుటుంబ కలహాలతో డిప్రెషన్‌కు లోనై ప్రాణాల మీదకు తెచ్చుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇవి కూడా చదవండి :
- నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. ఏప్రిల్‌లో రెండో విడత: మంత్రి పొంగులేటి!
- Gold Rate Today – March 8, ఆదివారం బంగారం ధరలు!
- Today Rasi Phalalu : 8 March 2026 ఆదివారం రాశి ఫలితాలు!
- శత్రువులకు ఆశ్రయమిస్తే వదిలిపెట్టం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు!
- 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. AWBI లో MTS పోస్టులు!
