Advertisement
tungaturthi hospital jobs

Jobs: ప్రభుత్వ ఆసుపత్రిలో 27 నూతన పోస్టులు మంజూరు.. 

మన పత్రిక, వెబ్​డెస్క్: తుంగతుర్తి (tungaturthi) వంద పడకల ఆసుపత్రికి 27 నూతన ఉద్యోగాలను మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హాస్పిటల్ ఇన్చార్జి డాక్టర్ నిర్మల్ కుమార్ తెలిపారు. మంజూరైన పోస్టుల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ వంటి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ కేటగిరీలు, ఆర్ఎంఓ, అనస్తీషియా పోస్టులు ఉన్నాయి.

Advertisement

కాగా, రూ. 40 కోట్ల వ్యయంతో 8 నెలల క్రితం ప్రారంభమైన నూతన భవన నిర్మాణం ప్రస్తుతం నిలిచిపోయింది. సుమారు రూ. 20 కోట్ల పనులు చేసినా బిల్లులు రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్‌ల దృష్టికి అధికారులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement