పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జూన్ 27, 2026న ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), హైదరాబాద్ కంట్రోల్ పరిధిలోని వివిధ కేటగిరీల ఖాళీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
త్వరలో నోటిఫికేషన్ విడుదల
ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తుల షెడ్యూల్‌ను TSLPRB త్వరలో విడుదల చేయనుంది. పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్ష తేదీలు తదితర వివరాలను నోటిఫికేషన్లో వెల్లడించే అవకాశం ఉంది.
బోర్డుకు కీలక ఆదేశాలు
లోకల్ కేడర్ వారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలు తదితర పూర్తి సమాచారాన్ని హోమ్ డిపార్ట్మెంట్, DGP కార్యాలయం వెంటనే TSLPRBకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఉద్యోగార్థులు ఏం చేయాలి?
తాజా ప్రభుత్వ ఉత్తర్వులతో తెలంగాణలో మరో భారీ పోలీసు నియామక ప్రక్రియకు మార్గం సుగమమైంది. కాబట్టి పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి చూస్తూనే, ఫిజికల్ ఫిట్నెస్, రాత పరీక్ష సిలబస్‌పై దృష్టి పెట్టి తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి :
- WhatsApp Username: ఎలా సెట్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
- బేబీ షవర్‌కు ముందు వివాదం: భర్త, అత్తను అరెస్ట్ చేసిన మెదక్ పోలీసులు
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
