తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ట్రాన్స్‌జెండర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని హైకోర్టు TSLPRBని ఆదేశించింది. దరఖాస్తు ఫారమ్‌లలో మేల్, ఫిమేల్‌తో పాటు ‘అదర్స్’ లేదా ట్రాన్స్‌జెండర్ ఆప్షన్ లేకపోవడాన్ని తప్పుపడుతూ తనుశ్రీ, ఇతరులు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. సాంకేతికంగా ఆన్‌లైన్‌లో వీలుకాకపోతే ఆఫ్‌లైన్ ద్వారా వారి దరఖాస్తులను స్వీకరించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
రాష్ట్రంలో వివిధ శాఖల్లోని 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 3,38,336 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 2.76 లక్షల మంది దరఖాస్తులను దాఖలు చేసినట్లు నియామక మండలి తెలిపింది. నియామకాల్లో తొలిసారి ఎస్సీ ఉప వర్గీకరణను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ, దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబరు 16 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
