Advertisement

Trainee IPS Uday Krishna : హైదరాబాద్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

మన పత్రిక, హైదరాబాద్: Trainee IPS Uday Krishna ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈయనపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, తీవ్ర వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

మహిళా అధికారిణిపై వేధింపుల ఆరోపణలు

కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత, ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయ్ కృష్ణారెడ్డి తనను అసభ్యకర మెసేజ్‌లతో వేధించడమే కాకుండా, గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమి, మెడపై కత్తిపెట్టి బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, బాధితురాలి ప్రైవేట్ వీడియోలను దొంగతనంగా రికార్డ్ చేసి, వాటిని ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అత్తాపూర్ పోలీసులు ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఎనిమిది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement