Advertisement

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

మన పత్రిక, హైదరాబాద్: సహచర ట్రైనీ ఆఫీసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో న్యాయస్థానం ఆయనను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న ఉదయ్ కృష్ణ రెడ్డిని పోలీసులు విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ కేసు నమోదుకు సంబంధించి పోలీసులు భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ (BNS) తో పాటు సమాచార సాంకేతిక ఐటీ (IT) చట్టం కింద పలు సెక్షన్లను నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఉదయ్ కృష్ణ రెడ్డికి మరో మహిళతో కూడా సంబంధం ఉన్నట్లు కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement