Advertisement

ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్న టీపీసీసీ

మన పత్రిక: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 నామినేటెడ్ పదవులను ఈ నెలలోనే భర్తీ చేయనున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ మంచి పనితీరు కనబరిచిన వారికి ఈ పదవుల విషయంలో ప్రాధాన్యత ఉంటుందని, వారిని తిరిగి రెన్యువల్ చేస్తామని ఆయన వెల్లడించారు.

పార్టీ వ్యవహారాలపై చర్చలు: పార్టీ పదవులకు సంబంధించి మీనాక్షి నటరాజన్‌తో చర్చలు జరిపినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. అలాగే మండల కమిటీల నియామకాలకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీలు సమర్పించిన నివేదికలే తుది నిర్ణయాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement