పాన్ ఇండియా వైడ్ గా మార్చి లో రాబోయే క్రేజీ సినిమాల్లో ‘టాక్సిక్'(Toxic) కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా నయనతార, కియార అద్వానీ అలాగే హుమా ఖురేషి లు ఫీమేల్ లీడ్స్ లో నటిస్తున్న ఈ భారీ సినిమాను మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu mohandas) తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా మొదలై మూడేళ్ళ పైనే కావస్తున్నా, ఫైనల్ గా మార్చి 19న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో 400 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకోనుందని వార్తలు వస్తుండగా, తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక వచ్చిన సమాచారం ప్రకారం టాక్సిక్ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు (Dil raju) దక్కించుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా 120 కోట్ల బిజినెస్ చేసినట్టు నెట్టింట ట్రెండ్ అవుతుంది. తెలుగులో పెద్ద స్టార్స్ కి కూడా ఇలాంటి బిజినెస్ జరగడం లేదు, అలాంటిది ఈ కన్నడ డబ్బింగ్ కి జరగడమేంటి అని కామెంట్స్ వస్తున్నాయి.
అయితే ఈ సినిమాకు అఫిషియల్ గా ఒక 50 కోట్ల లోపు తెలుగు బిజినెస్ జరిగి ఉండవచ్చని మరో వార్త కూడా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా వంద కోట్ల లోపే టాక్సిక్ తెలుగు బిజినెస్ ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే ఈ సినిమాపై అంత రిస్క్ చేయలేడని కూడా అనొచ్చు. ఏది ఏమైనా మార్చి లో చాలా టఫ్ ఫైట్ ఉండనుందని తెలుస్తుంది. టాక్సిక్ రిలీజ్ అయిన వారం రోజులకే తెలుగులో “పవన్ కళ్యాన్” (Pawan kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad bhagath singh) కూడా రిలీజ్ కానుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
