టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి (Sankranthi Race) ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అన్నీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లోనే రిలీజ్ కాగా, ఐదు సినిమాలు కూడా స్ట్రెయిట్ సినిమాలే కావడం విశేషం. అయితే వీటిలో రాజా సాబ్ (RajaSaab), భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi) మినహా, మిగతా మూడు సినిమాలు హిట్ అయ్యాయి. చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (ManaShankaraVaraPrasadGaru), నవీన్ పోలిశెట్టి (NaveenPolishetty) “అనగనగ ఒకరాజు” (Anaganaga OkaRaju), అలాగే శర్వానంద్ (Sharwanand) నటించిన “నారి నారి నడుమ మురారి” (NariNariNadumaMurari) సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి.
అయితే ఈ మూడింటిలో ఏ సినిమాకు ఎక్కువ లాభాలు వచ్చాయంటే ఇంకా చెప్పడం కష్టమే కానీ, వసూళ్ల పరంగా ఎంత సాధించాయో ఒక అంచనాకు రావచ్చు. విడుదలైన నాలుగు రోజుల్లోనే అనగనగా ఒక రాజు ప్రాఫిట్ జోన్ లోకి రాగా, ఇప్పటికే నిర్మాతకు 15 కోట్ల లాభాలు వచ్చాయి. అలాగే శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ కాగా 2 కోట్లకు పైగా ప్రాఫిట్ తో రన్ అవుతుంది. ఇక చిరు మన శంకర వర ప్రసాద్ ద్వారా నిర్మాతలు ఇప్పటికే 40 కోట్ల ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాగా లాంగ్ రన్ లో భారీ లాభాల దిశగా దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఏదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. అయితే క్లియర్ గా మన శంకర వర ప్రసాద్, అనగనగా ఒకరాజు సినిమాల మధ్యే గట్టి పోటీ ఉందని చెప్పాలి. ఈ వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేనందున సంక్రాంతి సినిమాల హడావిడి ఈ వారం కూడా కొనసాగుతుందని చెప్పాలి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
