ఈ వారం ప్రతి రాశికి ఏం జరగబోతోందో తెలుసా? మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. వృత్తి, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం – ప్రతి విభాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.
మేషం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి ఊరట లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. క్రయవిక్రయాల్లో లాభం పొందుతారు.
వృషభం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు మాత్రమే. నూతన వ్యాపారానికి కాలం అనుకూలం.
మిథునం: పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటికి, బయటకు మీదే పైచేయి. ఆరోగ్యానికి జాగ్రత్త. కొత్త వస్తువులు కొంటారు.
కర్కాటకం: వృత్తి, వ్యాపారాల్లో విజయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు అభివృద్ధి. నిర్ణయాల్లో తొందర పడకండి.
సింహం: ఇంటికి, బయటకు ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు వస్తాయి. ఆటంకాలు తొలగి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
కన్య: ఆర్థికం అంతంత మాత్రం. అవసరాలకు డబ్బు అందుతుంది. ముఖ్య పనులు సకాలంలో పూర్తి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
తుల: రుణాలు తీరి ఊరట. కుటుంబ చికాకులు తొలగుతాయి. ఆరోగ్యం, వాహనాలకు జాగ్రత్త. భూముల వ్యవహారాల్లో లాభం.
వృశ్చికం: ఉద్యోగంలో సవాళ్లు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సంతానానికి ఉద్యోగ అవకాశాలు. వ్యాపారంలో ధన లాభం.
ధనుస్సు: ఉద్యోగులకు కొత్త హోదాలు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం. ప్రముఖులతో పరిచయాలు.
మకరం: వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త పరిచయాలు పెరుగుతాయి.
కుంభం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం. సోదరులతో సుఖంగా గడుపుతారు. ఉద్యోగంలో స్థానచలనాలు.
మీనం: పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి, బయట చికాకులు తొలగుతాయి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
