Advertisement

Today Rasi Phalalu in Telugu: 22 అక్టోబర్ 2025 రాశి ఫలాలు

Horoscope in Telugu 22 october 2025: ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులకు సంబంధించిన సూచనలు, సలహాలు, శుభాశీషులు ఇక్కడ ఉన్నాయి.

మేషం: మీ కృషి ఫలప్రదం అవుతుంది. ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మానసిక ప్రశాంతతతో పనులు సజావుగా సాగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వర దర్శనం ఆత్మశాంతితో శుభఫలితాలను ప్రసాదిస్తుంది.

Advertisement

వృషభం: కాలం శుభప్రదంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. సృజనాత్మక ఆలోచనలు మంచి ఫలితాలను అందిస్తాయి. మనసు సంతోషంగా ఉంటుంది. ఇష్టదైవ స్మరణ శ్రేయస్సును కలిగిస్తుంది.

మిథునం: మీ తెలివితేటలు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. స్నేహితులతో ఆనందభరిత క్షణాలు గడుస్తాయి. కొత్త ప్రణాళికలు భవిష్యత్తు విజయాలకు పునాది వేస్తాయి. నిశ్చయాత్మక దృక్పథం అవసరం. గురు ధ్యానం అదృష్టాన్ని బలోపేతం చేస్తుంది.

కర్కాటకం: ఆర్థిక సంబంధ విషయాల్లో వివేకంతో వ్యవహరించాలి. అనవసర ఖర్చులను తగ్గించండి. కుటుంబ విషయాల్లో సహనం, దూరదృష్టి అవసరం. మీ సహజ దయా గుణం శాంతి వాతావరణాన్ని తెస్తుంది. దుర్గానామస్మరణ సానుకూల శక్తిని నింపుతుంది.

సింహం: సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయకమైన అవకాశాలు ఎదురవుతాయి. సాహసంతో ముందుకెళితే విజయం మీదే. చిన్న సమస్యలు పట్టుదలతో పరిష్కరిస్తారు. ఇష్టదైవ ధ్యానం మనోబలాన్ని పెంచుతుంది.

కన్య: ఉద్యోగ రంగంలో సంతోషకర వార్తలు వింటారు. కుటుంబంలో సఖ్యత, సంతోషం నెలకొంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. మానసిక ఉల్లాసం కోసం విశ్రాంతి తీసుకోండి. శ్రీలక్ష్మీ ధ్యానం ధనసౌభాగ్యాన్ని పెంచుతుంది.

తుల: మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వినోద కార్యక్రమాలతో ఆనందంగా సాగుతుంది. సృజనాత్మక ఆలోచనలు కొత్త అవకాశాలను తీసుకువస్తాయి. ఇష్టదైవ భక్తి శుభప్రదం.

వృశ్చికం: పట్టుదలతో ముందుకెళితే ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ఒక ముఖ్యమైన నిర్ణయం మిమ్మల్ని కొత్త దిశలో నడిపిస్తుంది. దుర్గా ధ్యానం శక్తితో పాటు విజయాన్ని ప్రసాదిస్తుంది.

ధనుస్సు: శుభసమాచారాలు మీ జీవితంలో ఉత్సాహాన్ని నింపుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వ్యక్తిగత సంబంధాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. శివ ధ్యానం మానసిక బలంతో పాటు సౌభాగ్యాన్ని అందిస్తుంది.

మకరం: పనుల్లో స్థిరత్వం సాధిస్తారు. వ్యాపార నిర్ణయాల్లో ముందుచూపు అవసరం. కృషి ఫలిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో శుభవార్తలు, ఆనందక్షణాలు ఉంటాయి. శ్రీవేంకటేశ్వర దర్శనం మీ విజయమార్గాన్ని బలపరుస్తుంది.

కుంభం: ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదల, ఓర్పుతో ముందుకు సాగితే శ్రేయస్కర ఫలితాలు వస్తాయి. ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ చూపండి. శ్రీలక్ష్మీ ఆరాధన మానసిక శక్తితో పాటు శాంతిని ఇస్తుంది.

మీనం: సౌభాగ్యం, సంపద పెరుగుతాయి. ఒక ముఖ్యమైన పని విజయవంతం అమవుతుంది. సమయానికి మద్దతు లభిస్తుంది. కొత్త వస్తువుల కొనుగోలు ఆనందాన్ని తెస్తుంది. హనుమాన్ చాలీసాచదవడం మంగళప్రదం.

Advertisement