హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం తాజా బంగారం, వెండి ధరలు కింది విధంగా ఉన్నాయి.
ముఖ్య ధరలు
| 24 క్యారెట్ (10గ్రా) | ₹1,54,200 |
| 22 క్యారెట్ (10గ్రా) | ₹1,41,350 |
| వెండి (1 కిలో) | ₹2,75,000 |
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి ఇవాళ భారీ శుభవార్త లభించింది. స్థానిక మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,370 మేర తగ్గగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.1,250 మేర క్షీణించింది. ఇదే సమయంలో కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.2,75,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు నమోదయ్యాయి.
దేశీయంగా పసిడి ధరలు తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు పెరగడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ పై 11 డాలర్లు పెరగ్గా, ప్రస్తుతం 4,800 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమేనని, సమయాన్ని బట్టి మార్పులు ఉంటాయని గమనించగలరు.
ఇతర ప్రధాన నగరాల్లో ధరలు (10 గ్రాములకు):
| నగరం | 22K (₹) | 24K (₹) |
| ఢిల్లీ | ₹1,41,500 | ₹1,54,350 |
| ముంబై | ₹1,41,350 | ₹1,54,200 |
| చెన్నై | ₹1,41,350 | ₹1,54,200 |
| కోల్కతా | ₹1,41,350 | ₹1,54,200 |
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
