Advertisement

తెలంగాణకు మూడు బులెట్ రైలు ప్రాజెక్టులు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

మన పత్రిక, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడు బులెట్ రైలు (Bullet Train) ప్రాజెక్టులలో మూడు తెలంగాణ రాష్ట్రం మీదుగానే వెళ్లనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. నగరంలోని హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు రెండు గంటల 35 నిమిషాల్లో, ముంబైకి రెండు గంటల 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే పుణేకు రెండు గంటల్లో, విజయవాడకు కేవలం 70 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు. భవిష్యత్తులో ఈ సరికొత్త రవాణా వ్యవస్థ దేశీయ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement