Advertisement

థార్ రాక్స్ ధరలో భారీ తగ్గింపు: జీఎస్టీ మార్పుతో ₹1.33 లక్షల వరకు పొదుపు

Advertisement

Mahindra thar roxx gets cheaper due to gst rate cut : మహీంద్రా థార్ రాక్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. 2025 సెప్టెంబర్ 6 నుంచి అమలులోకి వచ్చిన కొత్త జీఎస్టీ నిబంధనలతో ఈ ఎస్యూవీ ధరలో భారీ తగ్గింపు వచ్చింది. కొన్ని వేరియంట్లపై ₹1.33 లక్షల వరకు పొదుపు సాధ్యమయ్యింది.

Advertisement

ఇంతకు ముందు థార్ రాక్స్ పై 28% జీఎస్టీ + 20% కంపెన్సేషన్ సెస్ కలిపి 48% పన్ను విధించేవారు. ఇప్పుడు దీనిని 40% ఫ్లాట్ జీఎస్టీకి తగ్గించారు. దీంతో పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లపై 8% పన్ను తగ్గింపు వచ్చింది.

మహీంద్రా ఈ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు అందిస్తోంది. సెప్టెంబర్ 6, 2025 తర్వాత బుక్ చేసిన అన్ని ఆర్డర్లకు కొత్త ధరలు వర్తిస్తాయి.

Advertisement

థార్ రాక్స్ వేరియంట్ వారీ పొదుపు:

variantReduction
MX1₹81,200
MX3₹1.01 లక్ష
AX3 L₹98,300
MX5₹1.10 లక్షలు
AX5 L₹1.22 లక్షలు
AX7 L₹1.33 లక్షలు

టాప్ వేరియంట్ AX7 L పై అత్యధిక తగ్గింపు ఉంది. ఈ డబ్బుతో ఆక్సెసరీస్, ట్రిప్ ఖర్చులు చేయొచ్చు.

ఈ ధర తగ్గింపు కారణంగా థార్ రాక్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. ఆఫ్-రోడ్ లవర్స్ కు ఇది బెస్ట్ టైమ్ కొనుగోలు చేయడానికి. ఇతర ప్రీమియం ఎస్యూవీలతో పోలిస్తే కూడా థార్ రాక్స్ బెటర్ వాల్యూ అందిస్తోంది. టోయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా స్కార్పియో N, హ్యుందాయ్ క్రెటా కూడా జీఎస్టీ తగ్గింపు తర్వాత ధరలు సవరించాయి. కానీ థార్ రాక్స్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఆఫ్-రోడ్ పవర్ పరంగా ముందుంటోంది.

ఇప్పుడు కొనుగోలు చేస్తే డీలర్ ఆఫర్స్, ఫెస్టివ్ డిస్కౌంట్స్ కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇదే సరైన సమయం.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement