Advertisement

తల్లికి వందనం: ఫిర్యాదులు వస్తే సస్పెండ్ చేస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్

Advertisement

వినుకొండ: తల్లికి వందనం పథకం ( Thalliki Vandanam ) కింద డబ్బులు అందని వారి ఫిర్యాదులపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీరియస్ అయ్యారు. సోమవారం సిద్ధార్థ నగర్ లో పర్యటించిన సమయంలో పలువురు మహిళలు తమకు నిధులు రాలేదని జీవికి మొరపెట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన జీవి, మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. సర్వే పూర్తిగా ఎందుకు చేయలేదని నిలదీశారు. మళ్లీ ఇలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

Advertisement

అర్హులైన లబ్ధిదారులందరికీ తల్లికి వందనం నిధులు అందేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను జీవి ఆదేశించారు. పెండింగ్ అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జరిగింది. ప్రభుత్వం ఇటీవల రూ. 325 కోట్లను పెండింగ్ లబ్ధిదారులకు జమ చేయాలని నిర్ణయించింది. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement