మన పత్రిక వెబ్డెస్క్, చెన్నై: ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అధినేత, స్టార్ హీరో దళపతి విజయ్ తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలపై తొలిసారి స్పందించారు. భార్య సంగీత విడాకుల పిటిషన్, హీరోయిన్ త్రిషతో ఎఫైర్ రూమర్ల నడుమ.. శనివారం (మార్చి 7) పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన ప్రసంగంలో పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ.. “ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యల కోసం నేను పోరాడుతున్న క్రమంలో మీరు (అభిమానులు) బాధపడటం నేను చూస్తున్నాను. మీ బాధను చూసి నేను కూడా బాధపడుతున్నాను. నా సమస్యలను నేను చూసుకుంటాను. మీరు ఎలాంటి చింతా పెట్టుకోవద్దు” అని విజయ్ తన ఫాలోవర్లకు భరోసా ఇచ్చారు.
విడాకుల పిటిషన్ & త్రిషతో రూమర్లు: చెంగల్పట్టు కోర్టులో విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ తో పాటు, చెన్నైలోని ఇంట్లో నివాస హక్కులు కోరుతూ మరో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాను బ్రిటిష్ పౌరురాలినని, భారత్లో తనకు వేరే ఇల్లు లేదని ఆమె కోర్టుకు విన్నవించుకున్నారు. మరోవైపు, మార్చి 5న ఓ రిసెప్షన్లో విజయ్, త్రిష కలిసి ఫొటోలకు పోజులివ్వడంతో వీరిద్దరి బంధంపై వస్తున్న పుకార్లకు సోషల్ మీడియాలో మరింత ఆజ్యం పోసినట్లయింది.
మహిళలకు భారీ హామీలు: ఇదే సభలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు విజయ్ భారీ వరాలు ప్రకటించారు. TVK అధికారంలోకి వస్తే..
- ప్రతి నెలా మహిళలకు రూ. 2,500 ఆర్థిక సాయం.
- యువతుల వివాహ కానుకగా పట్టుచీరతో పాటు ఒక సవరం (తులం) బంగారం.
- ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు.
ఈ కీలక హామీలతో విజయ్ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- శత్రువులకు ఆశ్రయమిస్తే వదిలిపెట్టం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు!
- 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. AWBI లో MTS పోస్టులు!
- అబుదాబి దాడుల్లో సిరిసిల్ల యువకుడికి గాయాలు.. ఆందోళనలో కన్నవారు!
- పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ విషయంలో తగ్గేదే లేదన్న అధ్యక్షుడు!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సేవలు బంద్.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎమిరేట్స్ కీలక నిర్ణయం!
