మన పత్రిక, వెబ్‌డెస్క్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీజీఎస్ఆర్టీసీ భక్తులకు, ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ డిపో నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు మరియు పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలకే బస్సులను అద్దెకు ఇస్తున్నట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భక్తుల కోరిక మేరకు పంచారామాలు, శ్రీశైలం, వేములవాడ, అరుణాచలం, కొమరవెల్లి మల్లన్న వంటి పుణ్యక్షేత్రాలకు బస్సులు కేటాయిస్తామన్నారు.
Advertisement
అంతేకాకుండా, కార్తీక మాసం సందర్భంగా ఈసీఐఎల్ బస్టాండ్ నుండి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
