Advertisement
TGSRTC kartika masam special buses

TGSRTC: కార్తీక మాసానికి ప్రత్యేక బస్సులు.. కీసరగుట్టకు స్పెషల్!

మన పత్రిక, వెబ్​డెస్క్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీజీఎస్‌ఆర్టీసీ భక్తులకు, ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ డిపో నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు మరియు పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలకే బస్సులను అద్దెకు ఇస్తున్నట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భక్తుల కోరిక మేరకు పంచారామాలు, శ్రీశైలం, వేములవాడ, అరుణాచలం, కొమరవెల్లి మల్లన్న వంటి పుణ్యక్షేత్రాలకు బస్సులు కేటాయిస్తామన్నారు.

Advertisement

అంతేకాకుండా, కార్తీక మాసం సందర్భంగా ఈసీఐఎల్ బస్టాండ్ నుండి కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement