Advertisement

TGPSC గ్రూప్-2 (2015) జాబితా రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు!

మన పత్రిక, వెబ్​డెస్క్: TGPSC GROUP 2 2015 FINAL LIST – తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. TGPSC గ్రూప్-2 (2015) ఫైనల్ ఎంపిక జాబితాను పూర్తిగా రద్దు చేస్తూ న్యాయమూర్తి నాగేశ్ భీమపాక మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2017లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు, టెక్నికల్ కమిటీ నివేదికకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని కోర్టు తేల్చి చెప్పింది.

OMR షీట్ల పార్ట్-బి (జవాబుల భాగం)లో వైట్‌నర్ వాడకం, టాంపరింగ్ ఉంటే వాటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ TGPSC వాటిని పక్కనపెట్టి, ఆటోమేటెడ్ స్కానర్ల ద్వారా రీ-ఎవాల్యుయేషన్ చేసిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిక్ రిక్రూట్‌మెంట్‌లో పారదర్శకత అత్యంత ముఖ్యమని, అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యం కోసం న్యాయాన్ని బలి చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement
Advertisement