మన పత్రిక: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఒక గుడ్ న్యూస్ అందించింది. 2026 సంవత్సరానికి గాను జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును బోర్డు అధికారికంగా పెంచింది. ఇంతకుముందు ఉన్న ఫీజు చెల్లింపు చివరి తేదీ ముగియడంతో, ఇప్పుడు ఆ గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చారు.
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలలో ఫెయిల్ అయిన జనరల్ మరియు వొకేషనల్ విద్యార్థులందరికీ ఈ పొడిగించిన అవకాశం వర్తిస్తుంది. ఫీజు డేట్ మిస్ అయిన చాలా మంది విద్యార్థులకు ఇది ఊరటనిచ్చే అంశం. అభ్యర్థులు తమ కాలేజీల్లోనే నేరుగా ఈ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి బహుశా ఇది చివరి ఛాన్స్ కావచ్చు. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే కాలేజీ అధికారులతో కన్ఫర్మ్ చేసుకుని ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 23వ తేదీ లోపు ఫీజు చెల్లిస్తేనే పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- TGSRTC: ఏప్రిల్ 22 నుంచి టీజీఎస్ఆర్టీసీ సమ్మె
- Gold Price Today: ఈరోజు బంగారం ధరలు April 21
- NTRNeel : సాలిడ్ మాస్ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు… బాక్స్ ఆఫీస్ పై స్ట్రాంగ్ “సీల్” పడేలా ఉంది…
- Chiranjeevi : “మన శంకర వర ప్రసాదు గారి” వంద రోజుల పండగ…
- గుండె నిండా గుడి గంటలు: కరెంట్ షాక్ నుంచి బయటపడ్డ ప్రభావతి
