మన పత్రిక: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. కొత్త సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేసే ప్రక్రియలో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి అన్ని రకాల సేవలను నిలిపివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనితో వివిధ అవసరాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లే ప్రజలకు సేవలు అందుబాటులో ఉండవు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయ్యేందుకు సుమారు 36 గంటల సమయం పట్టనుంది. ఇదే సమయంలో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. సోమవారం ఉదయం నుంచి మళ్లీ సేవలు పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు “ప్రజలకు ముఖ్య ప్రకటన” పేరుతో పోస్టర్లను మీ సేవ కేంద్రాల్లో అతికించారు. అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. తాత్కాలిక అంతరాయం కారణంగా రెండు రోజుల పాటు కేంద్రాలకు వెళ్లకపోవడం మంచిదని నిర్వాహకులు సూచించారు.
TG: ఈ రోజు రాత్రి నుంచి మీసేవ బంద్

Advertisement