మన పత్రిక, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత రైతు భరోసా నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఈ డబ్బులను జమ చేయనుంది. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తారు.
రెండో విడత కింద మొత్తం 45,11,947 మంది రైతులకు రూ. 2063 కోట్లు అందనున్నాయి. నిధుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఎకరానికి రూ. 12 వేల చొప్పున ఇచ్చే ఈ పథకంలో గత నెల 23న తొలి విడత కింద సుమారు 74 లక్షల మందికి రూ. 3590 కోట్లు పంపిణీ చేశారు.
Advertisement
తాజా నిధులతో కలిపి యాసంగి సీజన్‌కు గాను మొత్తం రూ. 5653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అవుతుంది. ఇక చివరి విడత నిధులను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
Advertisement
