మన పత్రిక: తెలంగాణలోని రైతన్నలకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
కేంద్రమంత్రుల హర్షం
తెలంగాణ నుండి అదనపు బియ్యం సేకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల మేలు కోసం బీజేపీ ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించిందని వారు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
పెరిగిన సేకరణ లక్ష్యం
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26లో భాగంగా, మొదట 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. అయితే, రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థన మేరకు, కేంద్ర ప్రభుత్వం ఈ సేకరణ లక్ష్యాన్ని 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం తీరును తప్పుబట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
- సిద్దిపేటలో రాహుల్ గాంధీపై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ భారీ ర్యాలీ
- ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులో తల్లిదండ్రుల ఆధార్ నిబంధనతో ఇబ్బందులు
- విద్యార్థులకు సైకిళ్లు, షూస్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
- అక్టోబర్ చివరి వరకే సింగూరు ప్రాజెక్టు తాగునీరు
