మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి నుండి, శ్లాబ్ నిర్మాణం పూర్తయిన తర్వాత గతంలో ప్రకటించినట్లు ₹2 లక్షలు కాకుండా, ₹1.40 లక్షలు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.
Advertisement
ఈ పథకాన్ని ఉపాధి హామీ (90 పనిదినాలు)తో అనుసంధానించడం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఈ మార్పుకు కారణంగా తెలుస్తోంది. మిగిలిన ₹60 వేలను, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత చెల్లించే చివరి విడత ₹1 లక్షతో కలిపి అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

