Advertisement

TG FSL Recruitment: జనవరి 20 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ (TG FSL)లో 60 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) తదుపరి దశ అయిన ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) షెడ్యూల్‌ను ప్రకటించింది.

తేదీలు – వేదిక వివరాలు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం..

Advertisement
  • వెరిఫికేషన్ తేదీలు: జనవరి 20 నుంచి జనవరి 31 వరకు.
  • సమయం: ఉదయం 9 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది.
  • వేదిక: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, గచ్చిబౌలి, హైదరాబాద్.

ఇంటిమేషన్ లెటర్స్ డౌన్లోడ్ ఇలా.. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యేందుకు అవసరమైన ఇంటిమేషన్ లెటర్లను (Intimation Letters) జనవరి 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జనవరి 19వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ www.tgprb.in ద్వారా వీటిని పొందాలి.

కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే.. వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు కింది ఒరిజినల్ పత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకువెళ్లాలి:

  1. ఇంటిమేషన్ లెటర్
  2. ఆధార్ కార్డు
  3. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ఔట్
  4. 10వ తరగతి మెమో (Date of Birth కోసం)
  5. ఇంటర్మీడియట్ మెమో
  6. డిగ్రీ, పీజీ మార్కుల మెమోలు
  7. 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికెట్లు
  8. లోకల్ కాండిడేట్ నిర్ధారణ కోసం రెసిడెన్స్ సర్టిఫికెట్

పరీక్ష ఎప్పుడంటే? సర్టిఫికెట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 3వ లేదా 4వ వారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని బోర్డు తెలిపింది. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే support@tslprb.in మెయిల్ ద్వారా లేదా 9391005006 నంబరును సంప్రదించవచ్చని సూచించింది.

ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు

Advertisement