మన పత్రిక, రాజకీయం: క్యాతన్‌పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం (మార్చి 30) ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 4, 2026న ఈ మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడగా, అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుని ఆధిపత్యం చాటింది.
అయితే క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో కొన్ని పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ స్థానాల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
