తెలంగాణ ఈఏపీసెట్ 2025 బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్. ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగింది. ఈ నెల 21 నుంచి 22 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ప్రవేశాల ప్రక్రియ ఈనెల 24 నాటికి ముగుస్తుంది.
అలాట్‌మెంట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ముందుగా https://tgeapcetb.nic.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్ పేజీలో ‘క్యాండిడేట్ లాగిన్’ పై క్లిక్ చేయండి. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్ వివరాలతో లాగిన్ అవ్వండి. మీకు ఏ కాలేజీలో సీటు కేటాయించారో తెలుస్తుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్‌మెంట్ కాపీని సేవ్ చేసుకోండి. ఇది అడ్మిషన్ ప్రక్రియలో అత్యంత ముఖ్యం.
స్పాట్ అడ్మిషన్ల గురించి కూడా అధికారులు అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ ఫేజ్ రిపోర్టింగ్ పూర్తయిన తర్వాత, ఈనెల 23న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ అవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు.
మీవద్ద ఉండాల్సిన పత్రాలు:
- TGEAPCET -2025 ర్యాంక్ కార్డు
- టీజీ ఈఏపీసెట్ హాల్ టికెట్
- ఆధార్ కార్డు
- టెన్త్ మెమో
- ఇంటర్ మెమో
- ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
- టీసీ
- ఆదాయపు ధ్రువీకరణపత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- రెసిడెన్సీ సర్టిఫికెట్
- ఇతర అవసరమైన పత్రాలు
ఇంకా వివరాలు త్వరలో వెలడి కానున్నాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

